Disney+ Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్‌కు కోటికి పైగా సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై..

Disney+ Hotstar loses subscribers:  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌ కోటి 25 లక్షల మంది చందాదారులను కోల్పోయింది.

Updated : 10 Aug 2023 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) పెద్ద ఎత్తున సబ్‌స్క్రైబర్లను (Subscribers) కోల్పోయింది. మూడో త్రైమాసికంలో కోటి 25 లక్షల చందాదారులు దీనిని వీడారు. కొద్ది రోజుల క్రితం పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ఈ ఓటీటీ దిగ్గజంపై వార్తలు వచ్చాయి. దీంతో ఈ వేదికను వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలా పెద్ద ఎత్తున చందాదారులను కోల్పోయి 460 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

గత త్రైమాసికంలో అంతర్జాతీయంగా 7.4 శాతం మంది చందాదారులను కోల్పోయింది. రెండో త్రైమాసికంలో 157.8 మిలియన్లగా ఉన్న యూజర్ల సంఖ్య మూడో త్రైమాసికం నాటికి 146.1 మిలియన్లకు పడిపోయింది. అమెరికా (US), కెనడా (Canada)లో ఉన్న డిస్నీ సబ్‌స్క్రైబర్లలో దాదాపు మూడు లక్షల మంది తగ్గారు. అయితే, తమ స్ట్రీమింగ్ సేవల్లో యాడ్‌ సపోర్ట్‌డ్‌ వెర్షన్‌ను యూరోప్‌, కెనడా, అమెరికాల్లో తొందరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిస్నీ తెలిపింది.

 ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. రూ.21వేల కోట్లు

‘మా వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు సహాయపడే బహుళ మార్కెట్ల కోసం వేచిచూస్తున్నాం. తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలు అందించే మార్కెట్లు ఉన్నాయి’ అని డిస్నీ+హాట్‌స్టార్‌ సీఈఓ బాబ్ ఇగర్‌ తెలిపారు. డిస్నీ తీసుకొచ్చిన యాడ్ ఫ్రీ డిస్నీ (ad-free Disney) ప్లాన్‌తో పాటు హులు ప్లాన్‌ (Hulu plans) ధరల పెంపుతో కంపెనీ తిరిగి లాభదాయకంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాదితో పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఈ సంస్థ పరిమితులు విధించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని