Instagram: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Updated : 05 Mar 2024 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), థ్రెడ్స్‌, మెసెంజర్‌ సర్వీసులకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మెటా (Meta) సంస్థకు చెందిన ఈ సర్వీసులు సాంకేతిక సమస్య కారణంగా భారత్‌ సహా పలు దేశాల్లో స్తంభించడంతో నెటిజన్లు తమ ఖాతాలను ఆపరేట్‌ చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ (Downdetector) తెలిపింది.

దీంతో కోట్లాది మంది నెటిజన్లు ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. కాసేపు హైరానా పడ్డారు. త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలంటూ ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టారు. తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా, అందరికీ ఉందా అని ఆరా తీస్తున్నారు. అయితే, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై పనిచేస్తున్నట్లు మెటా కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి ఆండీ స్టోన్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కొద్దిసేపటికే ఒక్కొక్కటిగా సర్వీసులను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని