5G Spectrum: 6 రోజుల్లో రూ.1,50,130 కోట్ల బిడ్లు

5జీ స్పెక్ట్రమ్‌ వేలం, ఆరో రోజైన ఆదివారం ముగిసేనాటికి రూ.1,50,130 కోట్ల విలువైన బిడ్‌లు దాఖలయ్యాయి.

Updated : 01 Aug 2022 03:29 IST

నేడూ 5జీ స్పెక్ట్రమ్‌ వేలం

దిల్లీ: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం, ఆరో రోజైన ఆదివారం ముగిసేనాటికి రూ.1,50,130 కోట్ల విలువైన బిడ్‌లు దాఖలయ్యాయి. 10 కోట్లకు పైగా కనెక్షన్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఈస్ట్‌ సర్కిల్‌కు స్పెక్ట్రమ్‌ దక్కించుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నందునే, వేలం కొనసాగుతోంది. శనివారం వరకు దేశం మొత్తంమీద కలిపి రూ.1,49,966 కోట్ల బిడ్‌లు దాఖలయ్యాయి. ఆదివారం మరో రూ.164 కోట్ల విలువైన బిడ్లు దాఖలవ్వడంతో, మొత్తం విలువ రూ.1.5 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. ఆదివారం ఏడు రౌండ్లలో బిడ్డింగ్‌ జరిగింది.  సోమవారమూ వేలం కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని