BPCL: బీపీసీఎల్‌ నష్టం రూ.6,291 కోట్లు

ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) నికర నష్టం రూ.6,290.8 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే మూడు నెలల కాలంలోనూ రూ.3,192.58 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated : 07 Aug 2022 03:38 IST

దిల్లీ: ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) నికర నష్టం రూ.6,290.8 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే మూడు నెలల కాలంలోనూ రూ.3,192.58 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం రూ.89,688.98 కోట్ల నుంచి రూ.1.38 లక్షల కోట్లకు పెరగడం విశేషం. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ప్రతీ బ్యారెల్‌ ముడి చమురుపై కంపెనీకి 27.51 డాలర్లు లభించాయి. ఏడాది కిందట 4.12 డాలర్లే వచ్చాయి. పెరుగుతున్న వ్యయాలకు తగ్గట్లుగా ధరలను పెంచకపోవడంతో నికర నష్టాలను కంపెనీ నమోదు చేయాల్సి వచ్చింది. ‘బీపీసీఎల్‌ రిఫైనరీలు అత్యద్భుతంగా పనిచేశాయి. అందుకే స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు (జీఆర్‌ఎమ్‌) సైతం పెరిగాయ’ని ఫలితాల సందర్భంగా కంపెనీ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) వెత్స రామకృష్ణ గుప్త పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని