ఎంఎస్‌ఎంఈల్లో మహిళా ఉద్యోగులు 24%

దేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మహిళా ఉద్యోగుల సంఖ్య 24 శాతంగా ఉన్నట్లు ‘సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌’ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే నాయకత్వ స్థానాల్లోని మహిళల సంఖ్య

Published : 13 Sep 2022 02:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మహిళా ఉద్యోగుల సంఖ్య 24 శాతంగా ఉన్నట్లు ‘సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌’ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే నాయకత్వ స్థానాల్లోని మహిళల సంఖ్య 10 శాతమేనని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. ఎంఎస్‌ఎంఈ విభాగానికి చెందిన సంస్థల్లో మహిళా యాజమాన్యంలోనివి సగటున 20 శాతంగా ఉన్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని ఎంఎస్‌ఎంఈ సంస్థల్లో మహిళలకు చెందినవి 23.4 శాతం ఉన్నాయి. 10.4 శాతం వాటాతో తమిళనాడు తదుపరి స్థానంలో ఉంది. గత రెండేళ్ల కాలంలో ఈ రంగానికి చెందిన సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 45.5 శాతం పెరిగింది. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం కూడా వీటిల్లో తక్కువగా ఉంది. ఎంఎస్‌ఎంఈ విభాగానికి చెందిన సంస్థల వాటా జీడీపీలో 30 శాతంగా ఉందని.. ఈ విభాగంలో ఉద్యోగాల సంఖ్య పెరగడం ఎంతో సానుకూల పరిణామమని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఎండీ ఆదిత్య నారాయన్‌ మిశ్రా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని