ట్విటర్‌లో ఒప్పంద ఉద్యోగుల తొలగింపు!

ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌, సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. తాజాగా పొరుగు సేవల విభాగంలోనూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 15 Nov 2022 10:15 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌, సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. తాజాగా పొరుగు సేవల విభాగంలోనూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో సుమారు 3,000 మందిని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఇ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే, తాము లేఆఫ్‌లకు గురైనట్లు గుర్తించామని వారు చెప్పడం గమనార్హం. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని ట్విటర్‌ కార్యాలయాల్లో ఈ లేఆఫ్‌లు ఉన్నట్లు అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి. ట్విటర్‌కు చెందిన కంటెంట్‌ మోడరేషన్‌, స్థిరాస్తి, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని పొరుగు సేవల ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. వారిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. తాజా ఉద్యోగ కోతలపై  ట్విటర్‌ /మస్క్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని