రూ.31.5 లక్షల బీఎండబ్ల్యూ బైక్‌

జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌, సరికొత్త ఆర్‌ 18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ క్రూయిజర్‌ను మనదేశంలో గురువారం విడుదల చేసింది.

Published : 24 Mar 2023 01:34 IST

దిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌, సరికొత్త ఆర్‌ 18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ క్రూయిజర్‌ను మనదేశంలో గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.31.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ బైక్‌లను కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌ (సీబీయూ) తరహాలో ఆర్డర్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. దేశీయంగా క్రూయిజర్‌ విభాగంలో కంపెనీ ఆర్‌ 18, ఆర్‌ 18 క్లాసిక్‌, ఆర్‌ 18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ అనే 3 రకాల మోటార్‌సైకిళ్లను ఆఫర్‌ చేస్తోంది. అనిర్వచనీయ అనుభూతిని కోరుకునే మోటార్‌సైకిల్‌ చోదకులకు ఈ మోడల్‌ ఎంతగానో నచ్చుతుందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా వెల్లడించారు. ఈ బైక్‌ 1802 సీసీ ఇంజిన్‌, 91 హెచ్‌పీ సామర్థ్యంతో రూపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని