పోయిన ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే వ్యవస్థ 17 నుంచి అమలు!
పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే సాంకేతికతను ఈ వారమే దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే సాంకేతికతను ఈ వారమే దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమేటిక్స్ (సీడాట్) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 17న ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెండిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. సీడాట్ సీఈఓ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ధ్రువీకరించలేదు. కానీ దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. అందుకోసం వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా..
మొబైల్ ఫోన్‌ను విక్రయించడానికి ముందే దాని ఐఎంఈఐ నంబరును బహిర్గతం చేయాలనేది నిబంధన. మొబైల్ నెట్‌వర్క్‌ల వద్ద ఈ అధీకృత ఐఎంఈఐ నంబర్ల జాబితా ఉంటుంది. ఒకవేళ ఏవైనా అనధికార మొబైళ్లు తమ నెట్‌వర్క్‌లోకి వస్తే టెలికాం సంస్థలు గుర్తించగలుగుతాయి. సీఈఐఆర్ వ్యవస్థ, మొబైల్ నెట్‌వర్క్‌ల దగ్గర ఐఎంఈఐ నంబర్లు, వాటికి అనుసంధానమైన మొబైల్ నంబర్ల జాబితా ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే పోయిన ఫోన్లను ట్రాక్ చేసి, బ్లాక్ చేస్తారు. తద్వారా ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దొంగల్ని గుర్తించడానికి కూడా పోలీసులకు సులభమవుతుంది. ఇటీవల కర్ణాటక పోలీసులు 2,500కు పైగా పోయిన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వ్యవస్థను వినియోగించుకుని రికవరీ చేసి యజమానులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్‌వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్‌వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్‌స్పేస్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్‌లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్‌ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్‌లు కి‘రాక్’