విద్యుత్‌ వాహనాల నిర్వహణకు మాస్‌

విద్యుత్‌ వాహనాలను మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుగా మొబిలిటీ యాజ్‌ ఏ సర్వీస్‌ (మాస్‌) సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.

Published : 01 Jun 2023 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాలను మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుగా మొబిలిటీ యాజ్‌ ఏ సర్వీస్‌ (మాస్‌) సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఇందుకోసం జర్మనీకి చెందిన ఇ-మొబిలిటీ సేవల సంస్థ క్వాంట్రాన్‌ ఏజీతో ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. వాహనాన్ని ఏ సంస్థ ఉత్పత్తి చేసినా, ప్రతి వాహనంలోనూ ఈ సాఫ్ట్‌వేర్‌ పనిచేస్తుందని గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ చావలి తెలిపారు. వాహనాలను నిర్వహించే సంస్థలు, బీమా కంపెనీలకు వాహనం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలిసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వాహనం ఎన్నిసార్లు రోడ్డుపైకి వెళ్లింది, ఎంత దూరం ప్రయాణించింది లాంటివి తెలుసుకోవచ్చని వివరించారు. రవాణా సేవలను అందించే సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే టెలిమాట్రిక్స్‌ పరికరాన్ని వాహనంలో అమరుస్తామని తెలిపారు. ఇది వాహనానికి సంబంధించిన ప్రతి కదలికనూ నమోదు చేస్తుందన్నారు. అనుమతించని మార్గంలో వెళ్లినప్పుడు, వాహనాన్ని ఉన్నచోటే నిలిపివేయొచ్చని వివరించారు. ఈ భాగస్వామ్యం ద్వారా  అమెరికా, ఐరోపా దేశాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని