Gold Rates: పసిడికి అమెరికా రేట్లే దారిచూపుతాయ్‌

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.59,401 ఎగువన సానుకూలంగా కనిపిస్తోంది. అయితే లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.59,247 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాలి.

Published : 12 Jun 2023 06:56 IST

కమొడిటీస్‌ ఈ వారం

పసిడి

సిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.59,401 ఎగువన సానుకూలంగా కనిపిస్తోంది. అయితే లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.59,247 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాలి. పైకి వెళితే కాంట్రాక్టుకు రూ.60,157 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.60,494; రూ.60,872 వరకు రాణించొచ్చు. ఈవారం అమెరికా ఫెడ్‌ తీసుకునే నిర్ణయాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి.


వెండి

వెండి జులై కాంట్రాక్టు నిరోధ స్థాయైన రూ.73,102ను మించితే రూ.75,017 వరకు పెరగొచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.71,881 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.69,966 వరకు పడిపోవచ్చు.


ప్రాథమిక లోహాలు

రాగి జూన్‌ కాంట్రాక్టు రాణించే అవకాశాలున్నాయి. అయితే రూ.726.80 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే కాంట్రాక్టు మరింతగా పెరిగే అవకాశముంది.  

సీసం జూన్‌ కాంట్రాక్టు 5 వారాల నష్టాల అనంతరం గతవారం లాభాల్లో ముగిసింది. ఈ ధోరణిని కొనసాగిస్తుందా? లేదంటే లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుందా.. అనేది గమనించాలి. రూ.184 దిగువన ఇప్పటికీ కాంట్రాక్టు బలహీనంగానే కనిపిస్తోంది.

జింక్‌ జూన్‌ కాంట్రాక్టు రూ.204 కంటే దిగువన చలించకుంటే.. కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ఈ స్థాయికంటే కిందకు వస్తే లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.

అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టును రూ.207 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిది.


ఇంధన రంగం

ముడి చమురు జులై కాంట్రాక్టు పైకి వెళితే రూ.6,083 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.6,299; రూ.6,461 వరకు రాణించొచ్చు.  రూ.5,704 కంటే దిగువన ట్రేడయితే రూ.5,543; రూ.5,326 వరకు దిద్దుబాటు కావచ్చు.

సహజవాయువు జూన్‌ కాంట్రాక్టుకు రూ.195 వద్ద నిరోధం కన్పిస్తోంది. ఈ స్థాయిని మించితే రూ.205 వరకు పెరగొచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.180 వద్ద మద్దతు లభిస్తుంది. ఈ స్థాయినీ కోల్పోతే రూ.173 వరకు పడిపోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు జూన్‌ కాంట్రాక్టును, రూ.7,799 ఎగువన లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే. ఒకవేళ దిద్దుబాటు అయితే రూ.7,458 వద్ద మద్దతు దొరకొచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.7,175 వరకు పడిపోవచ్చు.

జీలకర్ర జూన్‌ కాంట్రాక్టు కిందకు వస్తే రూ.44,653 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.42,826కు దిగిరావచ్చు. ఒవకేళ పైకి వెళితే రూ.48,298 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.50,116 వరకు రాణించొచ్చు.

పత్తి జూన్‌ కాంట్రాక్టు రూ.58,120 కంటే దిగువన ట్రేడయితే మరింతగా దిద్దుబాటు కావచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని