హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 బైక్‌

హీరో మోటోకార్ప్‌, హార్లే డేవిడ్‌సన్‌ భాగస్వామ్యంలో తొలి మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేశారు. సరికొత్త హార్లే డేవిడ్‌సన్‌ ‘ఎక్స్‌ 440’ మోడల్‌ ప్రారంభ ధరను రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు.

Updated : 05 Jul 2023 17:58 IST

ప్రారంభ ధర రూ.2.29 లక్షలు

జయపూర్‌: హీరో మోటోకార్ప్‌, హార్లే డేవిడ్‌సన్‌ భాగస్వామ్యంలో తొలి మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేశారు. సరికొత్త హార్లే డేవిడ్‌సన్‌ ‘ఎక్స్‌ 440’ మోడల్‌ ప్రారంభ ధరను రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర రూ.2.69 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈ బైక్‌తో అందుబాటు ధర విభాగాల్లోకి హార్లే డేవిడ్‌సన్‌ అడుగుపెడుతోందని, దేశంలో మరింత మంది వినియోగదారులకు దిగ్గజ బ్రాండ్‌ చేరువయ్యే అవకాశం ఉన్నట్లు హీరో తెలిపింది. ప్రీమియం విభాగం (150-450 సీసీ)లో రికార్డు సంఖ్యలో కొత్త బైకులను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు హీరో మోటోకార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని