‘లఖ్‌పతి’తో లక్షార్జన!

స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు సంబంధించిన ‘లఖ్‌పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు.

Updated : 02 Feb 2024 05:15 IST

3 కోట్ల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ

దిల్లీ: స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు సంబంధించిన ‘లఖ్‌పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా స్వయం సహాయక మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి.. వారు ఏడాదికి కనీసం రూ.లక్ష స్థిర ఆదాయం పొందేలా చేయడమే పథక లక్ష్యం. ‘తొమ్మిది కోట్ల మహిళల సభ్యత్వంతో 83 లక్షలు ఉన్న ఎస్‌హెచ్‌జీలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపకరిస్తున్నాయి. ఈ సంఘాలతో ఇప్పటికే కోటి మంది మహిళలు లక్షాధిపతులయ్యారు. వీరు ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ‘లఖ్‌పతి దీదీ’ కింద 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని పిలుపునిచ్చారు. వీరు సాధించిన విజయాలు, మహిళల సంఘటిత స్ఫూర్తి చూసి ‘లఖ్‌పతి దీదీ’ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు నిర్దేశించుకున్నాం’ అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.ఈ పథకం కింద మహిళలకు డ్రోన్‌ ఆపరేటింగ్‌, ఎల్‌ఈడీ బల్బుల తయారీ వంటి పనుల్లో శిక్షణ ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని