స్థిరాదాయం అందించేలా

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ) అందుబాటులోకి వచ్చింది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ (ఎఫ్‌ఎంపీ)- సిరీస్‌ 92 (91 రోజులు) అనే ఈ పథకం కాల వ్యవధి 91 రోజులు.

Published : 02 Feb 2024 00:09 IST

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ) అందుబాటులోకి వచ్చింది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ (ఎఫ్‌ఎంపీ)- సిరీస్‌ 92 (91 రోజులు) అనే ఈ పథకం కాల వ్యవధి 91 రోజులు. ఈ కాల పరిమితికి లోబడి గడువు తీరిపోయే రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టి, స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని ఆర్జించడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ ఈ నెల 5. కనీస పెట్టుబడి రూ.5,000. ఎఫ్‌ఎంపీలపై ప్రస్తుతం దాదాపు 7 శాతం సగటు రాబడి లభిస్తోంది. ఇదే స్థాయిలో ఈ పథకంపై ప్రతిఫలం ఉండొచ్చు. స్థిరాదాయం అందించడంతోపాటు, పెట్టుబడి వృద్ధికి ఈ పథకం దోహదం చేస్తుంది. గడువు తీరిన తర్వాతే పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వీలవుతుంది. క్రిసిల్‌ లిక్విడ్‌ డెట్‌ ఇండెక్స్‌ను ఈ పథకానికి ప్రామాణిక సూచీగా తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని