Gold price: రూ.67 వేలు దాటిన బంగారం ధర

Gold price today: దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. రూ.67వేల మార్కు దాటింది.

Updated : 07 Mar 2024 18:54 IST

Gold price | దిల్లీ: దేశంలో బంగారం ధర (Gold price) మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.67 వేల మార్కును దాటింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి బులియన్‌ విపణిలో రూ.67,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి కిలో ధర రూ.74,900 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,152 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 24.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికాలో వడ్డీరేట్లు ఈ ఏడాదే తగ్గిస్తామని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. వచ్చే వారం ఫిబ్రవరి నెలకు గాను వెలువడే అమెరికా కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ డేటా బంగారం ధరల గమనాన్ని నిర్దేశించవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని