Google PlayStore: ప్రకటనలతో మోసం.. 22 యాప్‌లను తొలగించిన గూగుల్‌

గూగుల్‌ డెవలపర్‌ పాలసీకి విరుద్ధంగా యూజర్‌ డేటా సేకరిస్తున్న 22 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. యూజర్లు కూడా వెంటనే తమ డివైజ్‌ల నుంచి ఈ యాప్‌లను తొలగించాలని గూగుల్ సూచించింది.

Published : 21 Aug 2023 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాల్‌వేర్‌ దాడుల నుంచి యూజర్లకు భద్రత కల్పించేందుకు డెవలపర్‌ పాలసీ (Google Play Developer Policy)ని పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌ (Google PlayStore) నుంచి గూగుల్‌ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే మరో 22 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ ప్లేస్టోర్‌ నిబంధలనకు విరుద్ధంగా డేటా సేకరించడంతోపాటు, యూజర్‌ అనుమతి లేకుండా డివైజ్‌ను యాక్సెస్‌ చేసి ప్రకటనలు స్క్రోల్‌ చేయడం వంటివి చేస్తున్నారని మెకాఫే (McAfee) సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. దీనివల్ల యూజర్‌ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్‌ త్వరగా తగ్గిపోవడంతోపాటు, మొబైల్‌ డేటా కూడా ఖాళీ అవుతుందని వెల్లడించింది.

గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన వాటిలో లైవ్‌ టీవీ, మ్యూజిక్‌ డౌన్‌లోడ్‌, డిజిటల్‌ గిప్టింగ్‌, కొరియన్‌ లైవ్‌ టీవీ, ఆన్‌లైన్ లైవ్‌ టీవీ, ఉచిత మ్యూజిక్‌ రింగ్‌టోన్‌, సోషల్‌ మీడియా స్ట్రీమింగ్ కేటగిరి యాప్‌లు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లను సుమారు 2.5 మిలియన్‌ మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. యూజర్లు వెంటనే తమ డివైజ్‌ల నుంచి వీటిని తొలగించాలని సూచించింది.  

ఛైర్మన్‌ అయిన 15 రోజులకే గ్యాంగ్‌స్టర్‌తో గొడవ.. తొలి సవాల్‌ గురించి చెప్పిన రతన్‌ టాటా

ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన యాప్‌ల వివరాలు.. కంపోజ్‌ మ్యూజిక్‌ విత్‌ ఇనుస్ట్రుమెంట్స్‌, ట్రాట్‌ మ్యూజిక్‌ బాక్స్‌, ఏటీ ప్లేయర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌ - ఆడియో ప్లేయర్‌, పబ్‌జీ మొబైల్‌ (కేఆర్‌), ఎమ్‌మ్యూజిక్‌, ఆన్‌ఎయిర్‌ ఎయిర్‌లైన్‌ మేనేజర్‌, లైవ్‌ప్లే, స్ట్రీమ్‌కర్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, వాచ్‌ రియల్‌టైమ్‌ టీవీ డీఎంబీ, కామ్‌ఆన్‌ఎయిర్‌, ఆల్‌ ప్లేయర్‌, రింగ్‌టోన్‌ ఫ్రీ మ్యూజిక్‌, బారో, న్యూలైవ్‌, బారో టీవీ, బారో, మ్యూజిక్‌ డౌన్‌లోడర్‌, మ్యూజిక్‌ బడా, జిహోసాఫ్ట్‌ మొబైల్‌ రికవరీ యాప్‌, డీఎంబీ యాప్‌లు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని