మీ డబ్బు ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో.. సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి..!
ఈ చిన్న థంబ్ రూల్‌తో ప్రతీ పెట్టుబడికి సంబంధించి డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుంతో తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడులు పెడుతున్నప్పుడు.. ఎంత రాబడి వస్తుంది? ఎంత కాలానికి డబ్బు రెట్టింపు అవుతుంది? అని చాలా ఆలోచిస్తుంటారు. లెక్కించడానికి క్లిష్టమైన కాలిక్యులేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ చిన్న ట్రిక్‌తో మీ డబ్బు ఎంత కాలానికి రెట్టింపవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
ఎన్నేళ్లకు రెట్టింపు అవుతుంది?
పెట్టుబడులకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ పథకాలు అన్నింటికీ ఒకే రాబడి లభించదు. అలాగే ఒకే కాలపరిమితీ ఉండదు. అయినప్పటికీ ఈ చిన్న థంబ్ రూల్‌తో ప్రతి పెట్టుబడికి సంబంధించి డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుంతో తెలుసుకోవచ్చు. అయితే స్థిర రాబడి ఉండాలి. ఇందుకోసం మీరు మీ పెట్టుబడులపై వచ్చే రాబడితో 72ని భాగిస్తే సరిపోతుంది.
ఉదాహరణకు మీరు రూ.1 లక్ష 7% వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశానుకుందాం. ఈ లక్ష రూపాయిలు 2 లక్షలు కావాడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియాలంటే 72 ని 7తో భాగించాలి. అంటే 72/7= 10.2 సంవత్సరాలు పడుతుంది.
ఒకవేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టబడి పెట్టారనుకుంటే.. ఇక్కడ స్థిరమైన రాబడిని చెప్పలేం కాబట్టి సగటు రాబడిని తీసుకుందాం. మీ సగటు రాబడి 10% ఉందనుకుందాం. అంటే మీ డబ్బు రెట్టింపు కావడానికి 72/10= 7.2 ఏళ్లు పడుతుంది.
ఎంత రాబడి ఉండాలి..?
ఇదే సూత్రాన్ని రివర్స్ చేస్తే.. ఒక నిర్దిష్టమైన సమయంలో మన పెట్టుబడి రెట్టింపు కావాలంటే ఎంత రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ డబ్బు ఐదేళ్లలో రెట్టింపు కావాలనుకుంటే 72ని 5తో భాగిస్తే సరిపోతుంది. అంటే 72/5=14.4% రాబడి ఉన్న పథకాలను ఎంచుకోవాలి.
ఆర్థిక అవసరాలకు సరిపోయేలా..
మనం ఎప్పుడూ లక్ష్యానికి తగినట్లుగా పెట్టుబడులు ఎంచుకుంటుంటాం కాబట్టి, లక్ష్యానికి ఉన్న సమయం ఆధారంగా ఎంత రాబడి రావాలో లెక్కించి, సరైన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయి. మీకు 8 ఏళ్ల తర్వాత రూ. 20 లక్షలు కావాలనుకుందాం. ఇప్పుడు మీ రూల్‌తో లెక్కిస్తే 72/8=9%. కనీసం ఈ వడ్డీ రేటును ఇచ్చే పథకాన్ని ఎంచుకుని పెట్టుబడి పెట్టాలి.
కచ్చితంగా చెబుతుందా..?
ఇది 100% కచ్చితమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి. కొంత తేడా ఉండొచ్చు. పెట్టుబడుల విషయంలో సింపుల్ కాలిక్యులేషన్‌తో ఓ అంచనాకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Heart attack: పెళ్లి రోజే.. గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
-
India News
Odisha train Tragedy: లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ను ఎవరు ట్యాంపర్ చేశారు..?
-
General News
CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్