Whatsapp: వాట్సాప్‌లో AI స్టిక్కర్లు రూపొందించడం ఎలా?

వాట్సాప్‌ తాజాగా AI స్టిక్కర్ల రూపొందించుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం అది ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Published : 20 Aug 2023 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సందడి చేస్తున్న వాట్సాప్‌ (Whatsapp) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో స్టిక్కర్లను రూపొందించే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇంతకీ ఏఐ స్టిక్కర్లను ఎలా రూపొందించాలో తాజాగా వాబీటా ఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్‌కు సంబంధించి తాజా అప్‌డేట్స్‌ను వాబీటా ఇన్ఫో అందిస్తుంది.

AI స్టిక్కర్‌ రూపొందించడం ఎలా?

  • వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి..‘ఓపెన్‌ ఎనీ చాట్‌’పై క్లిక్‌ చేయాలి.
  • చాట్‌ పేజీలో దిగువన ఉన్న స్మైలీ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే స్టిక్కర్‌ విండో ఓపెన్‌ అవుతుంది.
  • AI స్టిక్కర్‌ ఫీచర్‌ మీకు అందుబాటులో ఉంటే..‘ Genarate your Own Sticker’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత ‘Create’ ఆప్షన్‌ ఎంచుకొని.. ఎలాంటి స్టిక్కర్‌ కావాలో, దానికి సంబంధించిన వివరాలను ఎంటర్‌ చేయాలి.
  • ఆ సమాచారం ఆధారంగా.. వివిధ AI స్టిక్కర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిని మీరు సెలక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు.

అయితే, ఈ ఫీచర్‌ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై మెటా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా స్టిక్కర్స్‌ రూపొందించేందుకు ఏ AI మోడల్‌ వినియోగిస్తోందన్నది కూడా బయటకు వెల్లడించలేదు. అయితే, ఈ ఫీచర్‌కు అవసరమైన భద్రత, కాపీరైట్స్‌ ఉండేలా తీసుకొచ్చే అవకాశం ఉంది. సందర్భానికి తగినట్లుగా రూపొందించే ఈ స్టిక్కర్లు అవతలి వ్యక్తికి కూడా సులువుగా అర్థమయ్యేందుకు వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని