FDs: అత్యధిక వడ్డీ రేట్లు అందించే డిపాజిట్లు ఇవే..

బ్యాంకులే కాకుండా ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీలు కూడా డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీను అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఎంతున్నాయో ఇప్పుడు చూద్దాం.

Published : 19 Nov 2022 12:36 IST

బ్యాంకులే కాకుండా కొన్ని ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను సేకరిస్తున్నాయి. ఇవి కూడా డిపాజిటర్లకు ఆకర్షణీయమైన వడ్డీను అందిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో వివిధ ఫైనాన్స్‌ కంపెనీలు కూడా తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. కంపెనీ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటికి 'AAA' రేటింగ్‌ ఉందా, లేదా అని తప్పనిసరిగా చూడాలి. ఈ రేటింగ్‌ ఉన్న కంపెనీలలోనే పెట్టుబడి పెట్టడం వల్ల డిపాజిట్లకు రిస్క్‌ తక్కువ. AA కంపెనీల డిపాజిట్లు కూడా పర్వాలేదు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు ఎఫ్‌డీలపై..డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌(DICGC) హామి ఉంటుంది. కానీ, కంపెనీ డిపాజిట్లకు అటువంటి హామి ఏమి ఉండదు. అసలు, వడ్డీ తిరిగి డిపాజిట్‌దారుకు చెల్లించకపోయినా ప్రభుత్వాలు తిరిగి చెల్లించే బాధ్యత వహించవు. న్యాయపరంగా తేల్చుకోవాలి. అత్యంత రేటింగ్‌ పొందిన కంపెనీ ఎఫ్‌డీలు కూడా గతంలో డిఫాల్ట్‌ అయ్యాయని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ ఆయా కంపెనీల నిర్వహణ, వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి.

వివిధ కంపెనీల డిపాజిట్ల వడ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి.

ఈ వడ్డీ రేట్లు 2022 నవంబరు 15 నాటివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని