మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం రూ.1,549 కోట్లు

M&M 4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 26 May 2023 19:08 IST

దిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (M&M) మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్‌ పద్ధతిలో 22 శాతం వృద్ధితో రూ.1,549 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం సైతం 31% పెరిగి రూ.22,571.37 కోట్లకు చేరుకుంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను ఆమోదించేందుకు జరిగిన బోర్డు సమావేశంలో M&M ఒక్కో షేరుకు రూ.16.25 డివిడెండ్‌ను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన చూసినప్పుడు 2023 ఆర్థిక సంవత్సరం లాభం 56% పెరిగి రూ.10,282 కోట్ల ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆటో సెక్టార్‌లో విజయవంతమైన మెగా లాంచ్‌లు, వ్యవసాయ పరికరాల అమ్మకాలలో స్థిరమైన వృద్ధి, ఆర్థిక సేవల్లో బలమైన నిర్వహణ పనితీరు స్పష్టంగా కనిపించాయి. SUV రెవెన్యూతో మార్కెట్‌ షేర్‌లో నెం.1 స్థానాన్ని తిరిగి పొందామని కంపెనీ తెలిపింది. LCVలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రిక్‌ 3-వీలర్‌లు కంపెనీ నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయని M&M సీఈఓ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని