Maruti Invicto: 3 వరుసల మారుతీ ఇన్విక్టో బుకింగ్స్‌ ప్రారంభం

Maruti Invicto: మారుతీ సుజుకీ కొత్తగా ఇన్విక్టో కారును తీసుకొస్తోంది. దీని బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

Published : 19 Jun 2023 14:58 IST

దిల్లీ: మూడు వరుసలు ఉండే ప్రీమియం ఎస్‌యూవీ ఇన్విక్టో (Invicto)ను మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్వరలో విడుదల చేయనుంది. దీని బుకింగ్‌లను సోమవారం నుంచి ప్రారంభించింది. జూలై 5న ఇది మార్కెట్‌లోకి రానుంది. కంపెనీ ప్రీమియం కార్ల రిటైల్‌ కేంద్రాలైన నెక్సా షోరూమ్‌లలో వీటిని బుక్‌ చేసుకోవచ్చు. లేదా మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా వెబ్‌సైట్‌లోనూ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.25 వేలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు.

మూడు వరుసలు ఉండే ప్రీమియం కార్ల సెగ్మెంట్‌లోకి మారుతీ సుజుకీ ఇన్విక్టో ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. రూ.20 లక్షల పైన విలువ చేసే కార్ల సెగ్మెంట్‌లో పట్టు సాధించడమే ధ్యేయంగా దీన్ని తీసుకొస్తోంది. రూ.15-20 లక్షల సెగ్మెంట్‌లో గత ఏడాది కంపెనీ మంచి విక్రయాలను నమోదు చేసింది. మూడు వరుసల ఎస్‌యూవీ/ఎంపీవీ సెగ్మెంట్‌లో గత ఏడాది 2.58 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడైనట్లు మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వీటిలో రూ.20 లక్షలపైన విలువ చేసే కార్లు 1.2- 1.25 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్‌యూవీతో పాటు ఎంపీవీ ఫీచర్లు కూడా ఉండే మూడు వరుసల కార్లు కావాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకునే ఇన్విక్టోను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని