Grand Vitara: గ్రాండ్‌ విటారా 11,177 కార్లు వెనక్కి

Grand Vitara: మారుతీ సుజుకీ 11,177 గ్రాండ్‌ విటారా కార్లను వెనక్కి పిలిపించింది. వెనుక సీట్‌ బెల్ట్‌ మౌంటింగ్‌ బ్రాకెట్లలో లోపాలను సరిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 24 Jan 2023 12:58 IST

దిల్లీ: వెనుక సీట్‌ బెల్ట్‌ మౌంటింగ్‌ బ్రాకెట్లలో లోపాలను సరిచేసేందుకు 11,177 గ్రాండ్‌ విటారా కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు మారుతీ సుజుకీ సోమవారం వెల్లడించింది. 2022 ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన ఈ మోడల్‌ కార్లలో, ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. లోపాలున్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని