Windows 11: విండోస్‌ 11లో ఆ యాప్స్‌ ఇక వినియోగించలేరు!

విండోస్‌ 11లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌కు మైక్రోసాఫ్ట్‌ తన సపోర్ట్‌ను నిలిపివేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయి.

Updated : 06 Mar 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విండోస్‌ 11తో (Windows 11) పనిచేస్తున్న పీసీల్లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ వినియోగిస్తున్నారా? అయితే, వచ్చే ఏడాది నుంచి ఆ యాప్స్‌ను వినియోగించలేరు. ఆండ్రాయిడ్‌ సబ్‌ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్‌ తన సపోర్ట్‌ను నిలిపివేయనుండడమే అందుక్కారణం. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్‌ డాక్యుమెంట్‌లో తెలియజేసింది.

మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్‌ సబ్‌సిస్టమ్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్‌ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసి యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్‌ డేట్‌ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుంది.

మొబైల్‌ యాప్స్‌ను విండోస్‌ 11 పీసీల్లో ఒకప్పుడు వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్‌- అమెజాన్‌ యాప్‌స్టోర్ డీల్‌ కారణంగా వీటిని వినియోగించడం వీలు పడింది. దీంతో అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని పాపులర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను, గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయంతో పీసీల్లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ వినియోగానికి తెరపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని