Ola electric: ఓలా ఎస్‌1 సిరీస్‌కు 2 వారాల్లో 75 వేల బుకింగ్స్‌!

Ola electric: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 సిరీస్‌లో కొత్తగా లాంచ్‌ చేసిన వాహనాకు పెద్ద ఎత్తున బుకింగ్స్‌ వచ్చాయని తెలిపింది.

Published : 29 Aug 2023 16:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) వాహన బుకింగ్స్‌లో అదరగొట్టింది. ఓలా ఎస్‌1 సిరీస్‌లో (Ola S1 Air) కొత్తగా లాంచ్‌ చేసిన విద్యుత్‌ స్కూటర్లకు పెద్దఎత్తున ఆదరణ లభించిందని పేర్కొంది. కేవలం రెండు వారాల్లోనే 75 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయని తెలిపింది. వాహన బుకింగ్స్‌ పట్ల ఓలా కంపెనీ ఆనందం వ్యక్తం చేసింది. 

గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. వారికి రూ.200 రాయితీ!

ఓలా ఇప్పటికే విక్రయిస్తున్న ఎస్‌1 ఎయిర్‌ (Ola S1 Air)తో పాటు ఓలా ఎస్‌1 ప్రో జనరేషన్‌ 2, ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ (ola S1X) స్కూటర్లను భారత మార్కెట్‌లో కొత్తగా లాంచ్‌ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.90 వేల నుంచి రూ.1.47 లక్షలుగా (ఎక్స్‌ షోరూం) కంపెనీ ప్రకటించింది. ఆగస్టు 15న ఓలా ఎస్‌ 1ఎక్స్‌ (ola S1X) సిరీస్‌లో మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎస్‌1 ఎక్స్‌ (2kWh), ఎస్‌1 ఎక్స్‌ (3kWh), ఎస్‌ 1 ఎక్స్‌+ పేరిట వీటిని లాంచ్‌ చేసింది. వీటి ప్రారంభ ధరలు రూ.79,999 నుంచి రూ. 99,999గా ఉన్నాయి. విద్యుత్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో M1 బ్రాండ్‌ పేరుతో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను తీసుకురావాలని ఓలా సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని