Ola S1 Pro Gen 2: ఓలా ఎస్‌1 ప్రో జెన్‌2 స్కూటర్‌ డెలివరీలు షురూ

Ola S1 Pro Gen 2: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ ఓలా ఎస్‌1 ప్రో జెన్‌2 స్కూటర్‌ డెలివరీలను ప్రారంభించింది.

Published : 14 Oct 2023 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ప్రో జెన్‌2 (S1 Pro Gen 2) స్కూటర్‌ డెలివరీలను ప్రారంభించింది. ఓలా ఎస్‌1 ప్రో జనరేషన్‌ 1 (S1 Pro Gen 1) స్కూటర్‌కు మరింత అత్యాధునిక ఫీచర్లను జోడించి ఓలా జెన్‌2 స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100కు పైగా నగరాల్లో ఈ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది.

రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

ఇక ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ విద్యుత్‌ స్కూటర్‌ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 195 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. 2.6 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఓలా పేర్కొంది. తక్కువ బరువు ఉండేలా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. 34-లీటర్ బూట్ స్పేస్, బలమైన గ్రాబ్ రైల్స్‌ ఇచ్చారు. బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్‌తో పాటూ 11kW పీక్ పవర్‌తో శక్తివంతమైన మిడ్-డ్రైవ్ మోటార్‌తో వస్తోంది. జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్‌నైట్ బ్లూ, అమెథిస్ట్.. ఈ ఐదు రంగుల్లో స్కూటర్‌ లభిస్తుంది. ఈ స్కూటర్‌ ధర రూ.1,47,499 (ఎక్స్‌షోరూం)గా కంపెనీ ప్రకటించింది. ఓలా అధికారిక యాప్‌ ద్వారా కూడా ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని