OpenAI: ఓపెన్‌ ఏఐకి భారత్‌లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?

OpenAI: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది.

Published : 19 Apr 2024 17:34 IST

OpenAI | ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన తొలి నియామకాన్ని చేపట్టింది. దేశంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రగ్యా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా నియమించింది. గతంలో ట్రూకాలర్‌లో ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా మిశ్రా విధులు నిర్వర్తించారు. అంతకుముందు వాట్సప్‌లోనూ ఆమె పని చేశారు. భారత్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓపెన్‌ఏఐ ఈ నియామకం చేపట్టడం గమనార్హం.

గతేడాదిలోనే ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రధాని మోదీని కలిసి, ఏఐ సాంకేతికత గురించి కొనియాడారు. ఇతరదేశాల కంటే ముందుగా భారత్‌లోనే చాట్‌జీపీటీని ఎక్కువమంది ఉపయోగించడం ప్రారంభించారని తెలిపారు. మరోవైపు ఏఐ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో దీనిపై నియంత్రణ తీసుకురావాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ నిబంధనలను అమలుచేసేందుకు ఓపెన్‌ ఏఐ చేపట్టిన తాజా నియామకం తోడ్పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని