Oppo: ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..

Oppo Reno 11 5G: ఒప్పో తన రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. వాటి ధర, ఫీచర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

Updated : 12 Jan 2024 15:03 IST

Oppo Reno 11 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఒప్పో రెనో 11 (Oppo Reno 11), ఒప్పో రెనో 11 ప్రో (Reno 11 Pro) పేరుతో వీటిని తీసుకొచ్చింది. జనవరి 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 14తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఒప్పో రెనో 11 (Oppo Reno 11) స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఎస్‌ 14తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 32ఎంపీ టెలీ ఫొటో లెన్స్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో రానుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా పేర్కొంది. వేవ్‌ గ్రీన్‌, రాక్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

బైజూస్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లే.. బ్లాక్‌రాక్‌ అంచనా!

ఒప్పో రెనో 11 5జీలో ఉన్న డిస్‌ప్లే, కెమెరానే ఒప్పో రెనో 11 ప్రో (Reno 11 Pro)లోనూ ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను అమర్చారు. 4,600mAh బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కేవలం 10 నిమిషాల్లో 45శాతం ఛార్జి అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. పెరల్ వైట్‌, రాక్‌ గ్రే రంగుల్లో దీన్ని తీసుకొచ్చారు. జనవరి 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, వన్‌ కార్డ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేసిన వారికి రూ.4,000 డిస్కౌంట్‌ అందించనుంది. పాత ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని