Aadhaar: ఫింగర్‌ ప్రింట్స్‌ లేకున్నా ఐరిస్‌ ఆధారంగా ఆధార్‌ జారీ

Aadhaar: ఫింగర్‌ ప్రింట్స్‌ లేకపోయినా ఐరిస్‌ ద్వారా ఆధార్‌ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Published : 09 Dec 2023 22:13 IST

దిల్లీ:  ఫింగర్‌ ప్రింట్స్‌ అందించలేని వారికి ఐరిస్‌ (iris scan) ద్వారా ఆధార్‌ (Aadhaar) కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ జారీకి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. కేరళలోని ఓ మహిళ ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం ఎదుర్కొన్న ఇబ్బంది వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది.

కేరళలోని పి జోస్‌ అనే మహిళకు వేళ్లు లేని కారణంగా ఆధార్‌ జారీకి అర్హత ఉన్నా కార్డు పొందలేకపోయింది. ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ఇలా వైకల్యం ఉన్నా, వేలిముద్రలు సరిగ్గా లేకపోయినా బయోమెట్రిక్‌కి బదులు ఐరిస్‌ ఆధారంగా ఆధార్‌ని జారీ చేయాలని పేర్కొన్నారు. బయోమెట్రిక్‌ వీలుకాని సమయంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆధార్‌ జారీ చేయాలని ఆధార్‌ సేవా కేంద్రాలకు సూచనలు జారీ చేశారు.

సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్‌!

ఐరిస్‌, వేలిముద్రలు సమర్పించలేకపోయినా అర్హులైన వారికి కూడా ఆధార్‌ అందజేయాలని ప్రభుత్వం ఇదివరకే నిబంధనల్లో పేర్కొంది. ఈ రెండు ఆధారాలు సమర్పించలేకపోవటానికి గల కారణాల్ని తెలుపుతూ ఫొటో ద్వారా ఆధార్‌కు నమోదు చేసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) బృందం జోస్‌ ఇంటికి వెళ్లి ఆధార్‌ నంబర్‌ను జనరేట్‌ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని