Realme C33: రియల్‌మీ సీ33లో కొత్త ఎడిషన్‌.. ధర, ఫీచర్లివే!

Realme C33: రియల్‌మీ సీ33 2023 ఎడిషన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డిజైన్‌, హార్డ్‌వేర్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ర్యామ్‌, స్టోరేజీని మాత్రం పెంచారు.

Updated : 14 Mar 2023 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌మీ సీ33 (Realme C33) 2023 ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. 2022లో ఈ ఫోన్‌ తొలిసారి మార్కెట్‌లోకి వచ్చింది. దానికే మరిన్ని అదనపు ఫీచర్లు జతచేసి కొత్తగా విడుదల చేశారు. డిజైన్‌, హార్డ్‌వేర్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ర్యామ్‌, స్టోరేజీని మాత్రం పెంచారు.

స్పెసిఫికేషన్లు.. (Realme C33 2023 Specifications)

  • 60Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన 6.5 అంగుళాల హెచ్‌డీ+ తెర
  • Unisoc టీ612 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌
  • వెనుక 50 ఎంపీ ప్రాథమిక సెన్సర్‌, ఏఐ సెన్సర్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా
  • 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 10వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • పక్క భాగంలో ఉండే పవర్‌ బటన్‌పైనే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌

వీటితో పాటు 2.4GHz వైఫై, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, గెలీలియో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ బరువు 187 గ్రాములు. మైక్రోఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉంది.

ధర.. (Realme C33 2023 Price)

రియల్‌మీ సీ33 2023 ఎడిషన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్‌ + 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.8,999. 4జీబీ + 64 జీబీ ధర రూ.9,999

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని