Redmi TV: ఫైర్ టీవీ OSతో రెడ్‌మీ తొలి టీవీ.. ₹12 వేల్లోపు ధరకే!
Redmi New smart TV: అమెజాన్ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రెడ్‌మీ కొత్త టీవీని లాంచ్ చేసింది. మార్చి 21 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: షావోమీ ఇండియా అనుబంధ సంస్థ రెడ్‌మీ (Redmi TV) మరో స్మార్ట్‌టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరిట దీన్ని తీసుకొచ్చింది. 32 అంగుళాల సైజులో సింగిల్ వేరియంట్‌లో వస్తున్న ఈ టీవీ ధరను రూ.13,999గా నిర్ణయించారు. గతంలోనూ రెడ్‌మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి. తొలిసారి అమెజాన్ ఫైర్ ఓఎస్‌తో ఈ టీవీని తీసుకొచ్చారు. అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రీమింగ్ డివైజులు వాడే వారికి ఈ ఓఎస్ సుపరిచితమే.
రెడ్‌మీ స్మార్ట్‌టీవీ హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తోంది. మార్చి 21 నుంచి విక్రయాలు ప్రారంభం కానన్నాయి. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకాలు జరగనున్నాయి. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా.. రూ.11,999కే లభిస్తుంది. ఇది ఫైర్ ఓఎస్ 7తో వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ సహా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ వంటి ఇతర యాప్స్‌నూ ఇందులో వినియోగించుకోవచ్చు. అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మరిన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫార్మాట్‌లో ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ సైతం లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
రెడ్‌మీ కొత్త టీవీలో 20W స్పీకర్‌ను అమర్చారు. ఇది డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్‌ప్లే, మిరాక్యాస్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఏవీ ఇన్‌పుట్ సాకెట్స్, 3.5 ఎంఎం సాకెట్ అందిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్‌నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ టీవీతో పాటు అలెక్సా వాయిస్ యాక్సెస్ కలిగిన రిమోట్‌ను అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!