Jio New plans: జియో నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌

Jio New Prepaid plans: ఎక్కువ మొబైల్‌ డేటా కోరుకునే వారి కోసం జియో మరో రెండుకొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.

Updated : 21 Jan 2023 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) మరో రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (Prepaid plans) తీసుకొచ్చింది. రోజుకు 2.5 జీబీ వ్యాలిడిటీతో నెల, మూడు నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను లాంచ్‌ చేసింది. వాటి ధరలను రూ.349, రూ.899గా నిర్ణయించింది. మొబైల్‌లో ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంయి.

రూ.349 ప్లాన్‌

రిలయన్స్ జియో తీసుకొచ్చిన రూ.349 ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ సేవలు అందనంగా లభిస్తాయి. 5జీ నెట్‌వర్క్‌ కవరేజీ అందుబాటులో ఉండీ 5జీకి సపోర్ట్‌ చేసే మొబైల్‌ ఉంటే వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అపరిమిత  5జీ డేటాను ఉచితంగా పొందొచ్చని జియో తెలిపింది.

రూ.899 ప్లాన్‌

మూడు నెలల (90 రోజులు) వ్యాలిడిటీ కోరుకునే వారికోసం రూ.899 ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. దీంట్లోనూ రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ సేవలు అదనంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లోనూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌ లభిస్తుంది. కొత్త ఏడాది పురస్కరించుకుని తీసుకొచ్చిన రూ.2023 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లోనూ దాదాపూ ఇవే సదుపాయాలు లభిస్తున్నాయి. ఇది 252 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 630జబీ డేటా లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని