సీనియర్‌ సిటిజన్లకు SBI గుడ్‌న్యూస్‌.. వ‌చ్చే ఏడాది వ‌ర‌కు స్పెష‌ల్ ఎఫ్‌డీ పొడిగింపు

మార్చి 31, 2023 వ‌ర‌కు గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Updated : 19 Sep 2022 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఎస్‌బీఐ వీ కేర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కం గ‌డువును మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 2020 మేలో ఎస్‌బీఐ ఈ ట‌ర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. తొలుత‌ 2020 సెప్టెంబ‌రు వ‌ర‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉంటుందని తెలిపిన‌ప్ప‌టికీ.. కొవిడ్‌- 19 కార‌ణంగా ఈ ప‌థ‌కం గ‌డువును ప‌లుమార్లు పొడిగించుకుంటూ వ‌చ్చింది. తాజాగా 2023 మార్చి 31 వ‌ర‌కు గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఎస్‌బీఐ స్పెష‌ల్ ఎఫ్‌డీ తాజా వ‌డ్డీ రేట్లు..

ఈ ప‌థ‌కం ద్వారా ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది.  సీనియర్‌ సిటిజన్లకు సాధారణ ప్రజల కంటే 50 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన సీనియర్‌ సిటిజన్లకు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.65 శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా.. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.45 శాతం వ‌డ్డీ లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని