Fixed Deposit: ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9.1 శాతం వడ్డీ

Fixed Deposit: సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ పౌరులకు 9.1 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 9.6 శాతం వడ్డీ చెల్లిస్తామని పేర్కొంది.

Updated : 05 May 2023 17:45 IST

దిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ (RBI) రెపో రేటును పెంచిన తర్వాత అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SSFB) డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్‌ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (Fixed Deposit) గరిష్ఠంగా 9.6 శాతం చెల్లించనుంది. సాధారణ పౌరులకు 9.1 శాతం వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తోంది. పెరిగిన వడ్డీ రేట్లు శుక్రవారం (మే 5) నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

తాజా వడ్డీ రేట్ల ప్రకారం.. సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల డిపాజిట్లపై 4 శాతం నుంచి 9.10 శాతం వడ్డీ రేటు పొందుతారు. సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 9.60 శాతం లభిస్తుంది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ తెలిపింది. అలాగే, సేవింగ్స్‌ ఖాతాలపై రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు 7 శాతం వరకు వడ్డీ లభిస్తుందని బ్యాంక్‌ తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్నామని, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) నుంచి బీమా రక్షణ కూడా ఉంటుందని బ్యాంక్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని