Gold smuggling: 6 నెలల్లో భారత్‌లోకి 2,000 కిలోల బంగారం స్మగ్లింగ్‌

Gold smuggling: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అక్రమ మార్గంలో దాదాపు 2000 కిలోల బంగారం భారత్‌లోకి ప్రవేశించినట్లు సీబీఐసీ వెల్లడించింది.

Published : 25 Oct 2023 14:13 IST

దిల్లీ: ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన దాదాపు రూ.2,000 కిలోల బంగారాన్ని (Gold smuggling) పట్టుకున్నట్లు ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC)’ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 43 శాతం పెరిగినట్లు పేర్కొంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.3,800 కిలోల అక్రమ బంగారం (Gold smuggling) పట్టుబడ్డట్లు సీబీఐసీ ఛైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అత్యధికంగా మయన్మార్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి బంగారాన్ని దుండగులు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

బంగారం స్మగ్లింగ్‌ (Gold smuggling) పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని సంజయ్‌ కుమార్‌ తెలిపారు. కేవలం కస్టమ్స్‌ సుంకం అధికంగా ఉండడం వల్లే కాదని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లోని ధరలను బట్టి కూడా స్మగ్లింగ్‌ పెరుగుతుంటుందని తెలిపారు. విమానయానం, సరిహద్దులు ఇలా ఏ మార్గం నుంచి అక్రమ బంగారం (Gold smuggling) వచ్చినా.. అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI)’ 2021- 22 నివేదిక ప్రకారం.. భారత్‌లో భారీ గిరాకీతో పాటు అధిక దిగుమతి సుంకం బంగారం స్మగ్లింగ్‌కు దారితీసింది.

బంగారంపై 12.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీతో పాటు 2.5 శాతం ఏఐడీసీ, మూడు శాతం ఐజీఎస్‌టీ వర్తిస్తోంది. మొత్తంగా 18.45 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. భారత్‌ బంగారం అవసరాల్లో అత్యధిక భాగం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని