Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 135 పాయింట్లు లాభపడి 71,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకొని 21,635 దగ్గర కొనసాగుతోంది.

Updated : 13 Feb 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ  (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 135 పాయింట్లు లాభపడి 71,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకొని 21,635 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.00 వద్ద మొదలైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఈ వారం అక్కడ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. నేడు ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగి 82.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.126.60 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,711.75 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.

సీమెన్స్‌, హిందాల్కో, ఐషర్‌ మోటార్స్‌, భెల్‌, బాష్‌, ఐఆర్‌సీటీసీ, ఆయిల్‌ ఇండియా, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, దీపక్‌ నైట్రేట్‌, ఐటీఐ, నేషనల్‌ అల్యూమినియం, ఎన్‌బీసీసీ, హిందుస్థాన్‌ కాపర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐనాక్స్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌, నెస్కో, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, జువారీ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని