Q3 Results: సన్‌ఫార్మా లాభం ₹2,166 కోట్లు

ప్రముఖ ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా 2022 డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాన్ని ఈ రోజు ప్రకటించింది.

Published : 31 Jan 2023 16:04 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఫార్మా సంస్థ సన్‌ఫార్మా (Sun Pharma) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆ కంపెనీ రూ.2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 5% పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,058 కోట్లు. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.9,863 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో 14% పెరిగి రూ.11,240 కోట్లకు చేరుకుంది. కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్‌కు రూ.7.50 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ధర 1.35% తగ్గి రూ.1,037.50 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని