WhatsApp: 71 లక్షల భారతీయ ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం

వాట్సాప్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 71 లక్షల ఖాతాలపై నవంబర్‌ నెలలో నిషేధం విధించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

Published : 02 Jan 2024 15:16 IST

దిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) గతేడాది నవంబర్‌ నెలలో 71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. తాజాగా విడుదల చేసిన యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌ (User Safety Report)లో ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్‌ నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా 71 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వీటిలో 19 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, సంస్థ నిబంధనలను అతిక్రమించిన కారణంగా వాటిపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. 

మరోవైపు నవంబర్‌లో యూజర్ల నుంచి 8,841 వినతులు వచ్చాయని, వాటిలో స్పామ్‌ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం, ప్రొడక్ట్ సపోర్ట్‌ వంటివి ఉన్నాయని తెలిపింది. యూజర్లు ఫిర్యాదులు చేసిన ఖాతాలపై యూజర్‌ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని కృత్రిమమేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ..అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. 

ఫోన్‌పేలో ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వాట్సాప్‌ ద్వారా నకిలీ సమాచార వ్యాప్తి, వ్యక్తిగత వేధింపులను అడ్డుకోవడం, యూజర్ల వ్యక్తిగత డేటాకు భంగం వాటిల్లకుండా మెటా (Meta) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏఐ, ఆధునిక సాంకేతికత, డేటా సైంటిస్ట్‌లు, నిపుణుల భాగస్వామ్యంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్స్‌ ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడంతోపాటు వారి నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపరచాలి. ఇందులో భాగంగానే వాట్సాప్‌ తాజా నివేదికను విడుదలచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని