WhatsApp: వాట్సప్‌లో కొత్త టెక్ట్స్‌ ఫార్మాటింగ్ టూల్స్‌

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్ టెక్ట్స్‌ ఫార్మాటింగ్ టూల్స్‌ని తన యూజర్ల కోసం తీసుకొస్తోంది. ఈ టూల్స్‌ ఎలా ఉపయోగపడతాయంటే..?

Published : 18 Jan 2024 02:22 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం వినియోగించే వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌లు పంపిచడం సాధారణం. ఏదైనా సుదీర్ఘ టెక్ట్స్‌ని పంపే సమయంలో ముఖ్యమైన అంశాన్ని హైలైట్‌ చేయడం, కొన్ని విషయాలను బుల్లెట్స్‌ రూపంలో మార్చడం వంటి సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి సదుపాయాన్నే అందించేందుకు వాట్సప్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టెక్ట్స్‌ ఫార్మాటింగ్‌ టూల్స్‌ని తన యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం వాట్సప్‌లో బోల్డ్‌, ఇటాలిక్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి. కొత్తగా మరికొన్ని టూల్స్‌ చేరబోతున్నాయి. 

సాధారణంగా ఏదైన సుదీర్ఘమైన టెక్ట్స్‌కి స్టైల్స్‌ జోడించటం, హైలెట్ చేయడం వంటివి చేయాలంటే కచ్చితంగా ఇతర యాప్‌లపై ఆధారపడాల్సిందే. ఇకపై అలాంటి సమస్య ఉండదు. నేరుగా వాట్సప్‌లోనే సులువుగా మార్చొచ్చు. దీనికోసం మెసేజింగ్‌ యాప్‌ కొత్త టెక్ట్స్‌ ఫార్మాటింగ్‌ టూల్స్‌ని తీసుకొస్తోంది. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ టూల్స్‌ని త్వరలో అందరూ వినియోగించుకోవచ్చు.

మీరు పంపించాలనుకున్న టెక్ట్స్‌లో ఏవైనా ముఖ్యమైన విషయాలను బుల్లెట్స్‌ రూపంలో అందిచాలనుకుంటే ఆ వాక్యం ముందు ‘*’ లేదా ‘-’ టైప్‌ చేయాలి. కోడ్ బ్లాక్స్‌ ఉపయోగించాలంటే టెక్ట్స్‌ ముందు ``ని, కోట్ బ్లాక్స్‌ కోసం టెక్ట్స్‌ ముందు > సింబల్‌ ఉంచాలి. సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌ చేయడానికి కోడ్‌ బ్లాక్‌ను వినియోగించొచ్చు. ఏదైనా మెసేజ్‌లోని కొంత భాగానికి రిప్లయ్‌ ఇచ్చేందుకు కోట్‌ బ్లాక్‌ ఉపయోగపడుతుంది. 

credit- wabetainfo

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని