WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక గ్రూప్స్‌లో వాయిస్‌ ఛాట్స్‌

WhatsApp: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ గ్రూప్స్‌ కోసం వాయిస్‌ ఛాట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..

Published : 14 Nov 2023 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా వాయిస్‌ ఛాట్స్‌ (voice chats) సదుపాయాన్ని ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ వాయిస్‌ ఛాట్స్‌ ఫీచర్‌ను రోల్‌ అవుట్‌ చేసినట్లు వాట్సప్‌ యాప్‌ వెల్లడించింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే?

సాధారణంగా ఉండే గ్రూప్‌ కాల్స్‌కు ఈ ఫీచర్‌ కాస్త భిన్నం. వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్‌ వస్తుంది. ఏ మీటింగ్‌లోనో ఉన్నప్పుడు ఇలా గ్రూప్‌ కాల్‌ వస్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ వాట్సప్‌ వాయిస్‌ ఛాట్స్‌ ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీంతో వాట్సప్‌ నుంచి గ్రూప్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి రింగ్‌ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్‌ ఛాట్‌లో పాల్గొనాలనుకొనే వారు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు.

Tesla: కేంద్రమంత్రికి మస్క్‌ క్షమాపణలు.. ఎందుకంటే..?

గ్రూప్స్‌లో ఈ వాయిస్‌ ఛాట్‌ సాయంతో 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్‌ కట్‌ అవుతుంది. కాల్‌లో జాయిన్‌ అయిన వ్యక్తులు మాత్రమే సంభాషణల్ని వినటానికి వీలుంటుందని వాట్సప్‌ పేర్కొంది. వాయిస్‌ ఛాట్‌లో పాల్గోని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడవచ్చని తెలిపింది. అంతే కాదు ఇందులో వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని తెలిపింది. గ్రూప్ చాట్‌లో పైన కుడివైపున్న వేవ్‌ఫార్మ్ ఐకాన్‌పై క్లిక్‌ చేసి వాయిస్ చాట్ ప్రారంభించవచ్చని వాట్సప్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ 33 పైబడి సభ్యులున్న గ్రూపులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ ప్రకటించింది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని