logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.76 కోట్లు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు.

Published : 16 Apr 2024 05:21 IST

కానుకలు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది

ఇంద్రకీలాద్రి,  న్యూస్‌టుడే : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. 19 రోజుల్లో హుండీల్లో వేసిన కానుకలను లెక్కించగా రూ.2.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 478 గ్రాములు, 4.830 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో భక్తులు చెల్లించుకున్నారు. అమెరికా డాలర్లు 1451, ఇంగ్లాండ్‌ పౌండ్లు 110, కెనడా డాలర్లు 85, అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ 110 హుండీల్లో వేశారు. ఇ-హుండీ ద్వారా రూ.70,541 భక్తులు సమర్పించారు. దేవస్థానం ఈవో రామారావు కానుకల లెక్కింపును పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని