logo

ఇంటర్‌ పరీక్షలు.. 6,509మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఒక్క ఘటన మినహా శనివారం ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 544 పరీక్షా కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి.

Published : 19 Mar 2023 01:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఒక్క ఘటన మినహా శనివారం ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 544 పరీక్షా కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. 1,80,035 మంది విద్యార్థులు హాజరవగా... 6509 మంది గైర్హాజరయ్యారని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. పాతబస్తీలోని మీరాలం ఫిల్టర్‌ బెడ్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున తుక్కు గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసాయి. సమీపంలోనే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాల ఉండటం, పొగలు వ్యాపిస్తుండటంతో ఇంటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులను సంప్రదించి మంటలు ఆర్పేయాలని అభ్యర్థించారు. ఈ లోపు పరీక్షలు రాసేందుకు విద్యార్థులు రాగా... వారిని సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌కు తరలించారు. మంటలు తగ్గకపోతే సమీపంలోని పాఠశాల లేదా కళాశాలలో నిర్వహించాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు వేగంగా మంటలు ఆర్పేయడంతో విద్యార్థులు మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలోనే పరీక్ష రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని