logo

Hyderabad: లెక్కకు మించిన బ్యాంకు ఖాతాల రద్దు..!

నగదు లావాదేవీలకు సంబంధించిన అనవసర బ్యాంకు ఖాతాలను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఓ అంచనా ప్రకారం బల్దియా ఆర్థిక విభాగం 200 బ్యాంకు ఖాతాలకు పైగా నిర్వహిస్తోంది.

Updated : 12 Dec 2023 07:55 IST

ఆర్థిక విభాగాన్ని ఆదేశించిన ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: నగదు లావాదేవీలకు సంబంధించిన అనవసర బ్యాంకు ఖాతాలను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఓ అంచనా ప్రకారం బల్దియా ఆర్థిక విభాగం 200 బ్యాంకు ఖాతాలకు పైగా నిర్వహిస్తోంది. వేర్వేరు ప్రభుత్వ కార్యక్రమాలకు తగ్గట్లుగా.. ప్రత్యేక ఖాతాలను తెరచి, వాటి ద్వారా లావాదేవీలు జరిపామని, వాటి సంఖ్య పెరగడంతో రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఓ అధికారి ‘ఈనాడు’తో తెలిపారు. కమిషనర్‌ కార్యాలయం ఆ మేరకు సూచన చేసిందన్నారు.

మిగులు నిధుల నుంచి రూ.6 వేల కోట్ల అప్పులకు..

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి.. మిగులు నిధుల నుంచి రూ.6వేల కోట్ల అప్పులకు దిగజారిందని, జీహెచ్‌ఎంసీ తెరచిన బ్యాంకు ఖాతాలన్నింటినీ పరిశీలిస్తే.. అప్పులకు కారణాలు తెలుస్తాయని ఉద్యోగ సంఘాలు  అభిప్రాయపడుతున్నాయి. అవసరం లేకపోయినా బ్యాంకు ఖాతాలు తెరచి, వాటిలో నిధులు జమ చేశారని, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు చాలా రోజులుగా ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వట్లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. లావాదేవీలను ప్రకటించాకే.. ఖాతాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు