logo

GHMC: ‘హైదరాబాద్‌లో హోర్డింగులను అనుమతించండి’

నగరంలో హోర్డింగులు, ఎల్‌ఈడీ తెరల ఏర్పాటుకు అనుమతించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది.

Updated : 10 Feb 2024 08:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో హోర్డింగులు, ఎల్‌ఈడీ తెరల ఏర్పాటుకు అనుమతించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. ప్రకటనల ఎత్తుపై ఉన్న నిబంధనలను ఉపసంహరించుకోవాలని కూడా విన్నవించింది. ప్రమాదాలు జరుగుతున్నాయంటూ హోర్డింగులపై గత సర్కారు నిషేధం విధించిందని, దానివల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరిందో తెలియదుగానీ జీహెచ్‌ఎంసీ ఖజానాపై మాత్రం తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. రూ.80 కోట్లుగా ఉన్న ప్రకటనల విభాగం వార్షిక ఆదాయం రూ.18 కోట్లకు పడిపోయింది. అలాగే గత సర్కారు హయాంలో యూనిపోల్స్‌, బస్టాపుల్లో ప్రకటనల ఒప్పందాలను పునఃపరిశీలించాలని, అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వాన్ని కోరారు. ఎఫ్‌ఓబీలు, ఇతర నిర్మాణాలకు ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ తెర ప్రకటనకూ పచ్చజెండా ఊపాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు మెట్రో పిల్లర్లపై ఎల్‌అండ్‌టీ సంస్థ ఏర్పాటు చేస్తోన్న ప్రకటనల రుసుము బకాయి రూ.50 కోట్లకు చేరిందని కూడా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని