logo

క్యాబ్‌లలో వస్తువులు మరిచిపోతున్నారు..!

క్యాబ్‌లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ - 2024’ నివేదికను ఉబర్‌ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.

Published : 20 Apr 2024 03:11 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: క్యాబ్‌లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ - 2024’ నివేదికను ఉబర్‌ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ప్రయాణ సమయంలో క్యాబ్‌లలో వస్తువులు మర్చిపోతున్న నగరాల జాబితాల్లో మొదటి మూడు స్థానాల్లో వరుసగా దిల్లీ, ముంబయి, బెంగళూరు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన ఈ జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉండేది. ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి ఉబర్‌ సంస్థ ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది. ఫోన్లు, బ్యాగ్‌లు, దుస్తులు, వాలెట్‌లు, పాస్‌పోర్టులు, బ్యాంక్‌, వ్యాపార పత్రాలను ప్రయాణికులు ఎక్కువగా క్యాబ్‌లలో మర్చిపోతున్నారు. ప్రయాణికులు ఎక్కువగా శనివారం తమ వస్తువులను మర్చిపోతున్నట్లు నివేదిక చెబుతోంది. ఉబర్‌ యాప్‌లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్‌ను ఉపయోగించుకొని పోగొట్టుకున్న వస్తువులపై ఫిర్యాదు చేసి తిరిగి పొందే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని