logo

ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి

ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.

Published : 20 Apr 2024 06:57 IST

అంబాజీని సత్కరిస్తున్న ఏనుగు నర్సింహారెడ్డి, కిషన్‌రావు, కొలకలూరి ఇనాక్‌, భట్టు రమేష్‌

నిజాంపేట, న్యూస్‌టుడే: ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. శ్రీవేెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ జానపద, సంప్రదాయ కళలు సమాజానికి అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి టి.కిషన్‌రావు మాట్లాడుతూ నాంపల్లి నుంచి బాచుపల్లిలోని సువిశాలమైన ప్రదేశానికి వర్సిటీని తరలించామని, ఇక్కడ వెయ్యేళ్ల వరకు నిలిచిపోయేలా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ వర్సిటీ నుంచి ఏటా విశిష్ట పురస్కారం పేరుతో అందజేస్తున్న అవార్డుకు సాహితీ, సాంస్కృతికరంగ ప్రముఖుల పేర్లను జతచేయాలని సూచించారు. ప్రముఖ చిత్రకారుడు సి.వి.అంబాజీకి విశిష్ట పురస్కారం, జ్ఞాపికను అందజేశారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని