logo

ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్‌

మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Updated : 23 Apr 2024 05:28 IST

ఎడ్లబండిపై ఊరేగింపుగా ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని

పెద్దేముల్‌: మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస నేతలు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ మాదిరిగానే దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అన్ని పథకాలూ అమలవుతాయన్నారు. అంతకుముందు ఎడ్లబండిపై ఊరేగింపుగా ప్రజలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్‌ సునీత సంపత్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా గ్రంథాల మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడ్‌, వైస్‌ ఎంపీపీ మధులత తదితరులు పాల్గొన్నారు.  

ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

దోమ, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. సోమవారం దోమ మండల కేంద్రంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాజపాకు ఓటేస్తే నిత్యం ఘర్షణలు తప్పవన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ యువ నాయకుడు శివకుమార్‌రెడ్డి, ఎంపీపీ అనుసూయ, కుల్కచర్ల పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని