Trisha: త్రిషకు చిరంజీవి మద్దతు.. మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు.

Published : 21 Nov 2023 13:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటి త్రిషపై (Trisha) నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీటిని ఖండిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌, నటి రోజా, రాధిక, గాయని చిన్మయి.. ఇలా టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖులు ఈ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. తాజాగా త్రిషకు మద్దతుగా చిరంజీవి (Chiranjeevi) పోస్ట్‌ పెట్టారు.

‘త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక నటిని మాత్రమే కాదు.. ఏ స్త్రీని ఇలా అనకూడదు. చాలా అసహ్యంగా ఉన్నాయి. వీటిని తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలా మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటాను’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మరోవైపు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది.

మమ్ముట్టి సినిమా రెండు దేశాల్లో బ్యాన్‌.. కారణమిదే!

అసలేమైందంటే.. కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై  త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. అతడితో నటించే అవకాశం రాకపోవడం ఆనందంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని