Payal Rajput: నా ప్రేమను రిజెక్ట్‌ చేశాడు.. బాధపడ్డా: పాయల్‌ రాజ్‌పుత్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన లవ్‌స్టోరీ గురించి చెప్పారు.

Published : 08 Nov 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో, హీరోయిన్ల ఇష్టాయిష్టాలు, వారి చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి తమ ఫేవరెట్‌ యాక్టర్ల లవ్‌ స్టోరీ గురించి ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలోనే నటి పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput)కు ప్రశ్న ఎదురవగా ఆమె ‘లవ్‌’ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు. తన కొత్త చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram) ప్రచారంలో భాగంగా పాయల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన విశేషాలు, వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ‘చదువుకునే రోజుల్లోనైనా, చిత్ర పరిశ్రమలోనైనా మీ క్రష్‌ ఎవరు?’ అనే ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. ‘‘స్కూల్‌ డేస్‌లో ఓ అబ్బాయిని ప్రేమించా. అతడిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగేది. నా ప్రేమను వ్యక్తం చేయగా అతడు నన్ను రిజెక్ట్‌ చేశాడు. ఆ బాధతో చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. దాంతో, పరీక్షల్లో ఫెయిలయ్యా. ఇదే విషయం మా అమ్మకు చెప్పి ఏడ్చేశా’’ అంటూ నాటి సంగతులు చెప్పారు. ‘మంగళవారం’ సినిమా చిత్రీకరణ రోజులు గుర్తుచేసుకుంటూ.. ‘‘షూటింగ్‌ సమయంలో నేను కిడ్నీ సమస్యతో చాలా బాధపడ్డా. నా జీవితంలో కష్టంగా గడిచిన క్షణాలవే. నేను ద్రవ పదార్థాలను తక్కువగా తీసుకునేదాన్ని. దయచేసి నీళ్లు ఎక్కువగా తాగండి’’ అని అభిమానులకు సూచించారు.

కెరీర్‌ విషయంలో గందరగోళంలో పడ్డా.. ఇది నా కమ్‌బ్యాక్‌: పాయల్‌ రాజ్‌పుత్‌

పాయల్‌ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన చిత్రమే ‘మంగళవారం’. నందితా శ్వేత, అజయ్‌ ఘోష్, దివ్యా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పాయల్‌ ప్రచారంతో బిజీగా ఉన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత పాయల్‌- అజయ్‌ భూపతి కాంబోలో తెరకెక్కిన చిత్రంకావడంతో ‘మంగళవారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 11న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయనేది సినీ వర్గాల టాక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని