వాట్సాప్‌ ఐపీ రక్షణ

వాట్సాప్‌ ఇటీవల ఐపీ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్‌ కాల్‌ చేస్తున్నప్పుడు ఇతరులకు ఐపీ చిరునామా కనిపించకుండా చేస్తుంది.

Published : 15 Nov 2023 01:27 IST

వాట్సాప్‌ ఇటీవల ఐపీ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్‌ కాల్‌ చేస్తున్నప్పుడు ఇతరులకు ఐపీ చిరునామా కనిపించకుండా చేస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే పరికరాల మధ్య కాల్స్‌ నేరుగా కాకుండా వాట్సాప్‌ సర్వీసుల ద్వారానే వెళ్తాయి. అందువల్ల ఇతరులు లొకేషన్‌ను ట్రాక్‌ చేయటం సాధ్యం కాదు. వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నప్పుడు ఇది మరింత భద్రత కల్పిస్తుంది. అయితే వాట్సాప్‌ సర్వీసెస్‌ ద్వారా కాల్స్‌ ప్రసారం కావటం వల్ల నాణ్యత కాస్త తగ్గే అవకాశముంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కొద్దిమందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ విస్తరించనున్నారు. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటానికి..

  •  ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • పైన కుడిమూలన మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి.
  • సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీలోకి వెళ్లాలి.
  •  కిందికి స్క్రోల్‌ చేస్తూ అడ్వాన్స్‌డ్‌ విభాగంలోకి వెళ్లాలి.
  • ‘ప్రొటెక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌’ మీద నొక్కాలి.
  •  స్విచ్‌ను ఆన్‌ చేసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని