ఆ అరుదైన కోవలో మనం ఉండాలి!
‘మహిళలు అందిపుచ్చుకోవాలే గానీ.. ఈ రోజుల్లో వారికోసం బోలెడన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు ఎదురుచూస్తున్నాయి’ అంటున్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉప కులపతి నజ్మా అఖ్తర్. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అందుకున్న ఆమె.. ఈ విద్యా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే..
(Photo: Twitter)
‘మహిళలు అందిపుచ్చుకోవాలే గానీ.. ఈ రోజుల్లో వారికోసం బోలెడన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు ఎదురుచూస్తున్నాయి’ అంటున్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉప కులపతి నజ్మా అఖ్తర్. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అందుకున్న ఆమె.. ఈ విద్యా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. తన కెరీర్లో వివిధ విద్యా సంస్థల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తూ.. నాణ్యమైన విద్యను అందించడంలో మార్పు తీసుకొచ్చే దిశగా కృషి సలిపారు. ఓ విద్యావేత్తగా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సాహిత్యం, విద్యారంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగానే తాజాగా ‘పద్మ శ్రీ’ పురస్కారం అందుకున్నారు నజ్మా. ‘అందరూ కష్టపడతారు.. కానీ గుర్తింపు కొందరికే వస్తుంది.. ఆ అరుదైన కోవలోనే మనముండాలి..’ అంటూ మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న ఈ విద్యావేత్త గురించి కొన్ని విశేషాలు మీకోసం..
* 1953, నవంబర్‌లో జన్మించారు నజ్మా అఖ్తర్. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె.. తన ప్రతిభకు గుర్తింపుగా బంగారు పతకం అందుకున్నారు. ‘జాతీయ సైన్స్ ట్యాలెంట్ స్కాలర్షిప్’ సైతం గెలుచుకున్నారు.
* కురుక్షేత్ర యూనివర్సిటీలో ‘సంప్రదాయ, దూర విద్యా విధానంపై తులనాత్మక అధ్యయనం’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేసిన ఆమెకు యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ‘కామన్వెల్త్ ఫెలోషిప్’ లభించింది.
* చదువు పూర్తయ్యాక దిల్లీలోని NIEPA రీసెర్చ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు నజ్మా. అదే విశ్వవిద్యాయంలో 15 ఏళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.
* తాను చదువుకున్న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అకడమిక్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్‌గా మరికొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. UNESCO, UNICEF, DANIDA.. వంటి సంస్థలకు సలహాదారుగా కూడా వ్యవహరించారు నజ్మా.
* IGNOU విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తల కోసం శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే కోర్సులు రూపొందించే బృందానికి నాయకత్వం వహించారు.
* ఇక 2019లో దిల్లీలోని ‘జామియా మిలియా ఇస్లామియా’ యూనివర్సిటీకి ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టిన నజ్మా.. ఆ విశ్వవిద్యాలయ వందేళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. దిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింటిలోకెల్లా తొలి మహిళా వీసీగా కీర్తి గడించారు.
* తన పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీలో నాణ్యమైన విద్యను అందించడంలో మార్పులు తీసుకురావడం, కొత్త కోర్సుల్ని ప్రవేశ పెట్టడం.. వంటి లక్ష్యాల్ని చేరుకోవడంలో సఫలీకృతురాలయ్యారామె. ఈ క్రమంలోనే JMIకి NAAC.. A++ గుర్తింపు దక్కింది. ఈ ఘనతను అందించిన మొదటి మహిళా వీసీ కూడా నజ్మానే!
* నజ్మా నేతృత్వంలోని JMI.. NIRFలో 6వ ర్యాంక్ సాధించింది. అంతేకాదు.. 2019-20కి గాను అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోకెల్లా 95.23 శాతం స్కోర్ సాధించడం ద్వారా అత్యుత్తమ పనితీరును కనబరిచింది.
ఇలా విద్యారంగంలో తాను చేసిన కృషికి గుర్తింపుగా తాజాగా ‘పద్మశ్రీ’ అందుకున్నారు నజ్మా. ‘ఇది నాకు దక్కిన గొప్ప పురస్కారం. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు నాకు మరింత ప్రోత్సాహం లభించింది. అందరూ కష్టపడతారు.. కానీ ఇలాంటి అరుదైన గుర్తింపు కొందరికే దక్కుతుంది. అందులో నేనుండడం గర్వకారణం..!’ అంటారు నజ్మా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. వంటింటి చిట్కాలు!
- మొహాన్ని మెరిపిస్తాయి!
- చెమటకు చుండ్రు తోడైతే...
- అక్కడ వెంట్రుకలు తొలగించాలంటే..!
- ముత్యమంత మొటిమే కదా?
ఆరోగ్యమస్తు
- శాకాహారుల ప్రొటీన్లు ఇవి!
- పుట్టుకతోనే మెల్లకన్ను.. సరిచేయచ్చా?
- మండే వేసవిలో.. చల్లదనం.. పోషకాలు!
- డుకన్ డైట్... తెలుసా?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- బ్రేకప్ అయినా.. ఆగిపోవద్దు!
- అది టెక్స్ట్లేషన్షిప్ మాత్రమే..!
- ఒక్క ఛాన్స్ తీసుకుందాం...
- ఈ రకం పెళ్లిళ్లలో ప్రేమకు, శృంగారానికి తావు లేదు!
- ఆడేద్దామా.. ఏడు పెంకులాట!
యూత్ కార్నర్
- ఈ ముగ్గురమ్మాయిలు.. ‘స్టాన్‌ఫర్డ్’ స్కాలర్స్’!
- Celebrity Fashion: అందాన్ని పెంచే ‘అజ్రఖ్’ ప్రింట్!
- వాళ్ల మాటలు విని సంతోషం ఆవిరైంది..!
- ఆ పుస్తకంలో మన ఆర్కిటెక్ట్స్..!
- ఈ మెకానిక్ తీరే వేరు!
'స్వీట్' హోం
- అందుకే మేల్కొంటాం..!
- ౩౫ ఏళ్లకే ఐదుగురు పిల్లలు.. ఒక మనవరాలు!
- రామ చక్కని సీతకి...
- అబద్ధాలు చెబుతున్నారా?
- చమేలీ... సుగంధాల రేరాణి!
వర్క్ & లైఫ్
- ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!
- ౩౫ ఏళ్లకే ఐదుగురు పిల్లలు.. ఒక మనవరాలు!
- మా మేనేజర్.. కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’..!
- పోటీలో నెగ్గాలంటే...