Alia Bhatt: బిజినెస్‌ పార్ట్‌నర్లుగా అలియా భట్‌, ఈషా అంబానీ.. మదర్స్‌ కలిశామంటూ పోస్ట్‌!

స్టార్‌ హీరోయిన్‌ అలియాభట్‌కు చెందిన ఎడ్‌-ఎ-మమ్మా, రిలయన్స్‌ రిటైల్‌ ఇకపై కలిసి పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ అలియా ఆనందం వ్యక్తం చేసింది.

Updated : 06 Sep 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముకేశ్‌ అంబానీ తనయ ఈషా అంబానీ (Isha Ambani), స్టార్ హీరోయిన్‌ అలియా భట్‌ (Alia Bhatt) వ్యాపార భాగస్వాములుకానున్నరని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా అలియా భట్‌ ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులకు సౌకర్యవంతమైన ఉత్పత్తులు అందించాలనేదే తామిరువురి కల అని తెలిపారు. తామిద్దరు మదర్స్‌కావడంతో వ్యక్తిగతంగానూ ఇది ఎంతో స్పెషల్‌ అని పేర్కొన్నారు.

కొన్నాళ్లపాటు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన అలియా.. 2020లో గర్భిణిగా ఉన్నప్పుడు చిన్నారుల కోసం ‘ఎడ్‌-ఎ- మమ్మా’ (Ed-A-Mamma) పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టారు. ఏడాదిలోనే కంపెనీ విలువ రూ.150 కోట్ల మార్కును దాటడం విశేషం. 2 నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల దుస్తులను విక్రయించే ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 800 వరకు వస్తువులు అందుబాటులో ఉన్నాయి. గతేడాది మెటర్నరీ వేర్‌ (ప్రెగ్నెన్నీ సమయంలో ధరించేవి) కూడా విక్రయించడం ప్రారంభించారు. స్వదేశీ బ్రాండ్‌లనే విక్రయించే ఈ సంస్థ ఎకో ఫ్రెండ్లీగా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈషా అంబానీ ఎడ్‌-ఎ- మమ్మాతో కలిసి వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారంటూ కొన్ని రోజుల కిత్రం ఊహాగానాలు వినిపించాయి. తాజాగా జరిగిన ఒప్పంద ప్రకారం రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) మెజారిటీ వాటా (51 శాతం) దక్కించుకుంది .

ఎడ్‌-ఎ- మమ్మాతో ఒప్పందం అనంతరం ఈషా అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఎడ్‌-ఎ- మమ్మా బ్రాండ్‌, స్థాపకురాలు అలియాభట్‌ను మేం ఎప్పుడూ ఆరాధిస్తాం. నా ప్రెగ్నెన్సీ సయమంలో ఈ బ్రాండ్‌ దుస్తులే ధరించా. మా పిల్లలు ఈ బ్రాండ్‌ ధరిస్తారు. అలాంటి సంస్థతో భాగస్వామ్యంకావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ఈషా అంబానీకి రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతలు ముకేశ్‌ అంబానీ గతేడాది అప్పగించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని